గ్రామాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:53 PM
కార్తీక శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని శనివారం గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. భక్తులు తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు ఆచరించి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
కార్తీక శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని శనివారం గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. భక్తులు తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు ఆచరించి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
శ్రీకూర్మంలో ఘనంగా తెప్పోత్సవం
గార, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ శ్రీకూర్మనాథ క్షేత్రంలో కార్తీక శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని శనివారం సాయంత్రం స్వామి వారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆల య ఈవో టి.విమలారాణి పర్యవేక్షణలో ప్రధాన అర్చకుడు చామర్ల సీతారామ నరసింహాచార్యులు తదితర అర్చకులు తొలుత స్వామి వారికి ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవ మూర్తులను తిరువీధిగా శ్వేత పుష్కరిణికి తీసుకువచ్చి తెప్పపై వేంచేపు చేసి నావికో త్సవం ఘనంగా నిర్వహించారు. పుష్కరిణిలో మూడుసార్లు తెప్పపై ఊరేగిం చారు. అనంతరం అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ప్రసాద నివేదన సమ ర్పించారు. వందలాది మంది భక్తులు తెప్ప తిరునాళ్లను కనులారా తిలకించి పులకిం చారు. ఎటు వంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో డీఎస్పీ ధనుంజయనాయుడు పర్య వేక్షణలో సీఐ రామకృష్ణ, ఎస్ఐ సీహెచ్ గంగరాజు ఆధ్వర్యంలో 30 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, ట్రస్టుబోర్డు సభ్యులు పాల్గొన్నారు.
బలగలో అయ్యప్ప స్వామికి..
శ్రీకాకుళం కల్చరల్, నవంబరు 21(ఆంద్రజ్యోతి): బలగలో అయ్యప్పస్వామి దేవాల యంలో శనివారం రాత్రి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. తొలుత అయ్యప్పస్వామి విగ్రహాలను ఆలయ అర్చకుడు దేవరకొండ శంకరనారా యణ శర్మ నేతృత్వంలో వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ బాణసంచా కాల్పుల మధ్య మణిగంగ పుష్క రిణి వద్దకు తీసుకువచ్చి తెప్పోత్సవం నిర్వహించారు. పుష్కరిణిలో మహిళలు దీపాలను వెలిగించారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. శరణుఘోషతో ఆ ప్రాంతం మారుమోగింది.
వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో..
ఇచ్ఛాపురం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాస శుద్ధ ద్వాదశి సందర్భంగా బొడ్డకాళి గ్రామంలో కొలువుతీరిన వైభవ వేంకటేశ్వరస్వామి, పట్టణంలోని గిలాయివీధి వెంకటేశ్వరస్వామి దేవాలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు స్వామి వార్లకు పంచామృతాలు, పళ్ల రసాలతో అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంక రించారు.
చినవంకలో...
వజ్రపుకొత్తూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కార్తీక ద్వాదశి పూజలు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏకాదశి రోజున ఉపవాసాలు ఉండి...ద్వాదశి నాడు ఉసిరి చెట్టుకు పూజలు చేసి సహపంక్తి భోజనాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా శనివారం గ్రామాల్లో ద్వాదశి పూజలతో సందడి వాతావరణం నెలకొంది.
ఘనంగా ద్వాదశి పూజలు
పోలాకి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కార్తీక ద్వాదశి సందర్భంగా శనివారం ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పోలాకి, కిల్లిబుచ్చెన్నపేట, గాతలవలస, పిన్నింటిపేట, ప్రియాగ్రహారం గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం దీపారాధన చేశారు. పల్లిపేట, అంపంలాం గ్రామాల్లో ఏకాహ భజనలు చేశారు.
వైభవంగా క్షీరాబ్ది ద్వాదశి...
నందిగాం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలో క్షీరాబ్ది ద్వాదశి పూజలను శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహింంచారు. ఈ సందర్భంగా ఆలయాలను దర్శించుకొని అర్చనలు చేశారు. నందిగాం శివాలయం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేసి.. అర్చకులకు స్వయంపాకాలు, దీప, వస్త్ర, సాలిగ్రామ దానాలు చేశారు.