ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:58 PM
ww
జలుమూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. గ్రామాల్లో ఆధ్యాత్మికంగా ఉత్సవాలు నిర్వహించడంతోనే ఐక్యతతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మంగళవారం మండలంలోని అంధవరంలో నిర్వహించిన సిరిమానోత్సవంలో పాల్గొని అసిరితల్లికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నరసన్నపేట నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన, టీడీపీమండలాధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, నాయకులు కింజరాపు సత్యం, రేగాన సత్యనారాయణ, అవురు తౌడు పాల్గొన్నారు.