Share News

గ్రామాల్లో ఆధ్యాత్మిక సందడి

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:15 AM

జిల్లాలో పలు గ్రామాల్లో ఆదివారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శివరాత్రితో పాటు రాజమ్మ, రాములోరి సంబరాలు నిర్వహించారు.

గ్రామాల్లో ఆధ్యాత్మిక సందడి
జి.సిగడాం: రామన్న తండ్రి ఉత్సవ విగ్రహానికి తిరువీధి నిర్వహిస్తున్న గ్రామస్థులు

వైభవంగా ఆదిత్యుని తిరువీధి

అరసవల్లి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు గ్రామాల్లో ఆదివారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శివరాత్రితో పాటు రాజమ్మ, రాములోరి సంబరాలు నిర్వహించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. అరసవల్లి సూర్యనారాయణ స్వామి తిరువీధి ఉత్సవం ఆది వారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవేరులతో సహా స్వామి ఉత్సవమూర్తులను నాగేంద్ర వాహనంపై వేంచేపు చేసి మాడ వీధుల్లో మేళతాళాలు, వేద మంత్రాల నడుమ ఊరేగించారు. కార్యక్రమంలో అర్చకులు నేతేటి హరిబాబు, రంజిత్‌ శర్మ, ఫణీంద్ర శర్మ, గ్రామస్థులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్థలతో రాజమ్మ సంబరం

గార, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): వత్స వలసలో ప్రసిద్ధ రాజరాజేశ్వరి (రాజమ్మ) సంబరాలు ఆదివారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి శనివారం రాత్రికి గ్రామానికి చేరుకున్న భక్తులు తెల్లవారు జామున సమీపంలోని సముద్రంలో స్నా నం ఆచరించి రాజమ్మను దర్శించు కుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించు కున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘట నలు జరగకుండా సీఐ కె.పైడపు నాయు డు, మెరైన్‌ సీఐ బి.ప్రసాదరావు, ఎస్‌ఐ సీహెచ్‌ గంగరాజు పర్యవేక్షణలో బందో బస్తు చేశారు. సముద్రం వద్ద హెచ్చరికలు జారీ చేశారు.

భక్తిశ్రద్ధలతో రామన్నతండ్రి సంబరాలు

జి.సిగడాం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): పెంట గ్రామంలో ఆదివారం రామన్న తండ్రి సంబరాలను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. మీసాల కుటుంబ ఇలవేల్పు రామన్న తండ్రిని వీధుల్లో మేళ తాళాలు, బాణ సంచా కాల్పులు, తప్పెడగుళ్లు, పందిరి పాటలు, జానపద, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఊరేగించారు. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నసమారాధ చేపట్టా రు. కార్యక్రమంలో నీటి యాజమాన్య సంఘం అధ్యక్షురాలు మీసాల విజయమ్మ, మీసాల లక్ష్మణ రావు, రమణ, శ్రీనివాసరావు, నారాయణరావు, గురునాయుడు, వరహాలనాయుడు, పోలి నాయుడు, లక్ష్మణ రావు, లక్ష్మణ, రాజరత్నంనాయుడు, గ్రామపెద్దలు, భక్తులు పాలొన్నారు.

ఘనంగా ధనరాజ తులసమ్మ సంబరాలు

ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 15(ఆంధ్ర జ్యోతి): లొద్దపుట్టి గ్రామదేవత ధనరాజ తులసమ్మ సంబరాన్ని ఆదివారం భక్తులు భక్తిశ్రద్ధలతో చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలి వచ్చి అమ్మవారి ఘటా లతో ఊరేగింపు చేపట్గారు. అమ్మవారికి ముర్రాటలు సమర్పించి మొక్కులు చెల్లించు కున్నారు.

Updated Date - Feb 16 , 2026 | 12:15 AM