మేలుకొలుపులతో ఆధ్యాత్మిక శోభ
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:37 PM
ధనుర్మాసం సందర్భంగా గ్రామాల్లో మేలుకొలుపు నిర్వహిస్తున్నారు.
సరుబుజ్జిలి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ధనుర్మాసం సందర్భంగా గ్రామాల్లో మేలుకొలుపు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే భజన బృం దాలు హరినామ కీర్తనలతో వీధుల్లో పర్యటిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఆధ్యా త్మిక శోభ ఏర్పడింది. గురువారం మండల కేంద్రంలోని నందికొండ కాలనీలో సరుబుజ్జిలి శ్రీమన్నారాయణ సీతారామ భజన బృందం మేలు కొలుపు సేవ నిర్వహించారు. తెల్లవారుజాము 4 గంటల నుంచే మహిళలు, పురుషులు, పిల్లలు హరేరామ, ఆండాలమ్మ గీతాలను ఆలపించారు.