Share News

వాహనాల వేగానికి కళ్లెం

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:35 PM

ఎచ్చెర్ల మండల పరిధి లోని కేశవరావుపేట కూడలి సమీపంలోని కింతలిమిల్లు జంక్షన్‌ నుంచి చిలకపాలెం వరకూ పాత జాతీయ రహదారి విస్తరించి ఉంది.

 వాహనాల వేగానికి కళ్లెం
కింతలిమిల్లు వద్ద ఏర్పాటు చేసిన వేగ నియంత్రణ సాధనాలు

-ప్రమాదాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు

-హాట్‌ స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి

-ఎచ్చెర్ల రహదారిపై రెండుచోట్ల స్టాపర్లు, బారికేడ్లు ఏర్పాటు

ఎచ్చెర్ల రూరల్‌, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల మండల పరిధి లోని కేశవరావుపేట కూడలి సమీపంలోని కింతలిమిల్లు జంక్షన్‌ నుంచి చిలకపాలెం వరకూ పాత జాతీయ రహదారి విస్తరించి ఉంది. వాహ నాల రద్దీ, రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఇక్కడ బైపాస్‌ రోడ్డు నిర్మిం చారు. దీంతో పాత జాతీయ రహదారిపై వాహనదారులు వేగంగా వాహనాలు నడపడం, యూటర్నుల వద్ద ప్రమాదాలు జరుగుతుండ డంతో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా కింతలి మిల్లు యూటర్న్‌ వద్ద పెంట్రోల్‌ బంకు దగ్గరగా ఉండటం, వైన్‌షాప్‌ కూడా ఇక్కడే ఉండడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నా యి. అదే విధంగా ఎచ్చెర్ల కేశవరెడ్డి పాఠశాల సమీపంలో యూటర్ను వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ట్రిపుల్‌ ఐటీ వైపు వెళ్లే వారు, ఎచ్చెర్ల, ఎస్‌ఎం.పురం రోడ్డు నుంచి వచ్చేవారు ఇక్కడే తిరుగు తుండడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో ఈ రెండు హాట్‌ స్పాట్‌లపై పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ రెండుచోట్ల వాహనాల వేగం నియంత్రణ కోసం స్టాపర్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ విషయమై జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం మాట్లాడుతూ.. ‘వాహన చోదకుల అతి వేగం, డ్రంకెన్‌ డ్రైవ్‌ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల నియంత్రణకు యూటర్న్‌లపై ప్రత్యేక దృష్టిపెడుతున్నాం. వాహనదారులు బాధ్యతగా డ్రైవింగ్‌ చేస్తే ప్రమాదా లు తగ్గుతా యి.’అని అన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 11:35 PM