Share News

నేడు, రేపు ‘శంకర గ్రంథ రత్నావళి’పై ప్రసంగం

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:05 AM

జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవాల్లో భాగంగా శని, ఆదివారాల్లో తిరుపతి జాతీయ సంస్కృత విద్యాలయం ప్రొఫెసర్‌ కుప్పా విశ్వనాథ శర్మ శంకర గ్రంథ రత్నావళిపై ప్రసంగించనున్నారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు, రేపు ‘శంకర గ్రంథ రత్నావళి’పై ప్రసంగం

అరసవల్లి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవాల్లో భాగంగా శని, ఆదివారాల్లో తిరుపతి జాతీయ సంస్కృత విద్యాలయం ప్రొఫెసర్‌ కుప్పా విశ్వనాథ శర్మ శంకర గ్రంథ రత్నావళిపై ప్రసంగించనున్నారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. శృంగేరీ పీఠం ఫౌండేషన్‌, చిన్ముద్ర ట్రస్టు, ఉపనిషన్మందిరం, రాజరాజేశ్వరీదేవీ పీఠం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక గుజరాతి పేట సమీపంలో ఉన్న విశ్వహిందూ పరి షత్‌ (వీహెచ్‌పీ) కార్యాలయంలో సా యంత్రం 6 గంటలకు ఈ ప్రసంగాలు ఉంటాయని నిర్వాహకులు పెంట చంద్ర శేఖర శర్మ, కార్తికేయ శర్మ తెలిపారు. భక్తులు పాల్గొని కార్యక్రమాలను విజయ వంతం చేయాలని వారు కోరారు.

Updated Date - Apr 25 , 2026 | 12:05 AM