Share News

మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా

ABN , Publish Date - Aug 17 , 2026 | 11:37 PM

జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిల్వలు, క్రయ, విక్రయాలు, రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఈ మేరకు సోమవారం టెక్కలి పోలీసుల ఆధ్వర్యంలో రై ల్వేస్టేషన్‌తో పాటు దుకాణాలను తనిఖీ చేశారు.

మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా
టెక్కలి రైల్వేస్టేషన్‌లో జాగిలంతో తనిఖీ చేస్తున్న పోలీసులు

టెక్కలి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిల్వలు, క్రయ, విక్రయాలు, రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఈ మేరకు సోమవారం టెక్కలి పోలీసుల ఆధ్వర్యంలో రై ల్వేస్టేషన్‌తో పాటు దుకాణాలను తనిఖీ చేశారు. బస్‌స్టేషన్‌లో అ నుమానం ఉన్న ప్రయాణికుల లగేజీ బ్యాగులను నార్కోటిక్‌ పోలీసు జాగిలంుతో పరిశీలించి గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వలను గుర్తించేందుకు సో దాలు చేశారు. గంజా యి నిల్వలు, క్రయవిక్రయాలు, రవా ణాను అరికట్టేందుకు తనిఖీలు చేపడు తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తని ఖీల్లో ఎస్‌ఐ రాము, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2026 | 11:37 PM