Share News

జడ్పీ, మండల పరిషత్‌లకు ప్రత్యేకాధికారులు

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:18 AM

శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ (జడ్పీ)తో పాటు జిల్లాలోని మండల ప్రజా పరిషత్‌ల (ఎంపీపీ) పాలకవర్గాల పదవీకాలం ముగియనుండడంతో వీటికి ప్రత్యేకాధికారులను (స్పెషల్‌ ఆఫీసర్‌) నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వర్తించేలా రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌ దండే శనివారం వేర్వేరు ఉత్త ర్వులు జారీ చేశారు.

 జడ్పీ, మండల పరిషత్‌లకు ప్రత్యేకాధికారులు

జడ్పీ స్పెషల్‌ ఆఫీసర్‌గా కలెక్టర్‌

ఉత్తర్వులు జారీ

శ్రీకాకుళం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ (జడ్పీ)తో పాటు జిల్లాలోని మండల ప్రజా పరిషత్‌ల (ఎంపీపీ) పాలకవర్గాల పదవీకాలం ముగియనుండడంతో వీటికి ప్రత్యేకాధికారులను (స్పెషల్‌ ఆఫీసర్‌) నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వర్తించేలా రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌ దండే శనివారం వేర్వేరు ఉత్త ర్వులు జారీ చేశారు. జిల్లా పరిషత్‌ పాలకవర్గం పదవీ కాలం ఈనెల 24తో ముగియనుండడం తో కలెక్టర్‌ను ప్రత్యేక అధికా రిగా నియమిస్తూ జీవో 129ని విడుదలచేసింది. ఈనెల 25 నుం చి ఆరు నెలల పాటు లేదా కొత్త పాలకవర్గం ఎన్నికై బాధ్యతలు చేపట్టే వరకు జడ్పీ స్పెషల్‌ ఆఫీసర్‌గా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. ఈ సమయంలో జడ్పీకి సంబంధించిన పూర్తి అధికారాలు, విధు లు కలెక్టర్‌ పర్యవేక్షణలో ఉంటాయి. అలాగే మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యుల పదవీకాలం కూడా ఈనెల 13తో ముగియ నుండడంతో 24 నుంచి ప్రత్యేకాధికా రుల పాలన అమలులోకి రానుంది. ఈ మేరకు ప్రత్యేకాధికా రులను నియమించే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్‌కు అప్ప గించింది. ఎంపీడీవో కంటే కనీసం ఒక ర్యాంకు పైన ఉన్న జిల్లా స్థాయి అధికారులు, డిప్యూటీ డైరెక్టర్లు లేదా ఆర్డీవో స్థాయి అధికారులను మండల పరిషత్‌లకు స్పెషల్‌ ఆఫీస ర్లుగా నియ మించనున్నారు.

అయితే ఈ నియామకాల్లో ఇంజనీరింగ్‌ అధికారులను మినహాయించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరించే వరకు లేదా ఆరు నెలల పాటు వీరు ఆయా మండలాల్లో విధులు నిర్వర్తిస్తారని జీవో 128లో పేర్కొన్నారు. ఈనెల 23 తర్వాత పదవీకాలం ముగిసే ఎంపీపీ లు జిల్లాలో ఏవైనా ఉంటే, వాటికి కూడా ఇదే నిబంధనల ప్రకారం తగిన సమయంలో కలెక్టర్‌ ప్రత్యేకాధికారులను నియ మించనున్నారు.

Updated Date - Sep 20 , 2026 | 12:18 AM