Share News

గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:07 AM

గ్రామీణాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించిందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.

 గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
తిడ్డిమిలో స్వర్ణగ్రామం భవనాన్నిప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు :

పాతపట్నం/రూరల్‌, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): గ్రామీణాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించిందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం మండలంలోని తిడ్డిమిలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో రూ.40లక్షల నిధులతో నిర్మితమైన స్వర్ణ గ్రామం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ రెండేళ్లపాలనలో ప్రతిగ్రామంలో మౌలిక వసతులు పెంచుతూ అభివృద్ధి పనులు ముమ్మరంగా జరిపాయని తెలిపారు. కార్యక్ర మంలో పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 12:07 AM