Share News

పశు సంపద పరిరక్షణపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:15 AM

Minister Atchannaidu Gopooja with family ‘రైతు వ్యతిరేక వైఖరితో వైసీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పశుసంపద పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింద’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

పశు సంపద పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
ఆవును పూజిస్తున్న మంత్రి అచ్చెన్న, కుటుంబ సభ్యులు

- మంత్రి అచ్చెన్నాయుడు

- కుటుంబ సమేతంగా గోపూజ

కోటబొమ్మాళి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ‘రైతు వ్యతిరేక వైఖరితో వైసీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పశుసంపద పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింద’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం నిమ్మాడలోని స్వగృహంలో కనుప పండగ సందర్భంగా సతీమణి మాధవి, కుటుంబసభ్యులతో కలిసి గోవులకు పూజలు చేశారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ ‘అన్నదాతలతో పాటు పశుపోషకులు, కోళ్ల రైతుల కష్టాలను గుర్తించి మినీ గోకులాలను పునరుద్ధరించాం. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నాం. పశువులకు మినీ గోకులం షెడ్ల నిర్మాణాలు, పశుగ్రాస క్షేత్రాలకు రాయితీ తదితర కార్యక్రమాలు ప్రారంభించాం. పాడి పరిశ్రమ అభివృద్ధికి, పశు సంపద పరిరక్షణకు, గొర్రెలు, మేకల పెంపకం దారులకు ఉపయోగపడేలా మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తామ’ని తెలిపారు.

Updated Date - Jan 17 , 2026 | 12:15 AM