Share News

వెయ్యి మంది విద్యార్థులుంటే ప్రత్యేక సదుపాయాలు

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:59 PM

వెయ్యి మంది విద్యార్థులుండే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డీఈవో రవిబాబు అన్నారు.

వెయ్యి మంది విద్యార్థులుంటే ప్రత్యేక సదుపాయాలు
పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో రవిబాబు

ప్రణాళికాబద్ధంగా చదువుకోండి

డీఈవో రవిబాబు

ఇచ్ఛాపురం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): వెయ్యి మంది విద్యార్థులుండే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డీఈవో రవిబాబు అన్నారు. గురువారం ఆయన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ప్రతీ తరగతి గదికి వెళ్లి నేరుగా విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయుల బోధన తీరుపై ఆరా తీశారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలన్నారు. శతశాతం ఉత్తీర్ణత సాధించాలని, ఈ దిశగా ఉపాధ్యా యులు చర్యలు తీసుకోవాలన్నారు. ‘గవర్నమెంట్‌ మిషన్‌ మార్చ్‌’లో భాగం గా ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్లిప్‌ టెస్‌ నిర్వహించాలని సూచించారు. గతేడాది వచ్చిన మార్కుల కన్నా ఎక్కువ రావాలని సూచించారు. ఎండీఎంను తనిఖీ చేశారు. విద్యార్థులకు రుచికర మైన భోజనం అందించాలని, వంటశాలను పరిశుభ్రంగా ఉంచాలని నిర్వా హకులకు ఆదేశించారు. లైబ్రరీ, ల్యాబ్‌లు పరిశీలించారు. రాష్ట్రంలో 1000 మంది పిల్లలున్న పాఠశాలలు 64 ఉంటే.. వాటిలో జిల్లాలోని ఇచ్ఛాపురం పీఎంశ్రీ ఉన్నత పాఠశాల ఒకటని, అందుకే పూర్తి స్థాయిలో తనిఖీకి వచ్చామన్నారు. నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నామన్నా రు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో విలియమ్స్‌, ఎంఈవో సూర్యారావు, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2026 | 11:59 PM