నేడు, రేపు సర్ ప్రత్యేక శిబిరాలు
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:44 PM
ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ జాబితా(సర్) కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆర్డీవో కె.సాయి ప్రత్యూష తెలిపారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 3(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ జాబితా(సర్) కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆర్డీవో కె.సాయి ప్రత్యూష తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలో సర్ ప్రక్రియ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్ ప్రక్రియలో భాగంగా శిబిరాలు నిర్వహిస్తున్నామ న్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలో 279 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌వోలు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటారని చెప్పారు. నమోదు పత్రాలు స్వీకరణ, ధ్రువీ కరణ, డిజిటలీకరణ సేవలు అందిస్తారని తెలిపారు. ప్రతి ఓటరు నమోదు పత్రాన్ని నింపి, సంబంధిత బీఎల్‌వోకు సమర్పించాలన్నారు.