Share News

వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:54 PM

వృద్ధాశ్రమాల్లో ఉండే వృద్ధులు, మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు సూచిం చారు.

 వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
వృద్ధులతో మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు

శ్రీకాకుళం లీగల్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): వృద్ధాశ్రమాల్లో ఉండే వృద్ధులు, మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు సూచిం చారు. రాష్ట్ర న్యాయాధికార సంస్థ, జిల్లా ప్రధాన న్యాయాధికారి ఆదేశాల మేరకు సోమవారం స్థానిక నాగజ్యోతి వృద్ధాశ్రమం, స్టేట్‌ హోంలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. వారికి అంది స్తున్న వసతి తదితర సౌకర్యాలను అడిగి తెలు సుకున్నారు. వైద్య, ఆహార సదుపాయాలు సరిగా అందించాలని సిబ్బందికి ఆదేశించారు. పింఛన్లు అందని వృద్ధులు అవసరమైన ధ్రువ పత్రాలు సమకూర్చు కుంటే తమ సంస్థ ద్వారా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కోరుకుంటే వృద్ధులను తిరిగి ఇంటికి వెళ్లేందుకు అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని పేర్కొన్నారు. అలాగే స్టేట్‌ హోంలో వసతి పొందుతున్న మహిళలతో మాట్లాడి వివ రాలు తెలుసుకున్నారు. ఆవరణ పరిశుభ్రత, అక్కడ ఉంటున్న మహిళలకు అందిస్తున్న ఆహా రం తదితర విషయాలపై ఆరా తీశారు. స్టేట్‌ హోంలో ఉంటున్న వారు బయటకు వెళ్లే సంద ర్భంలో తప్పనిసరిగా మూమెంట్‌ రిజిస్టర్‌లో వివ రాలు నమోదు చేయాలని సూచించారు. కార్య క్రమంలో నాగజ్యోతి నిలయం నిర్వాహకుడు ఎస్‌.సాయి సుధాకర్‌, జిల్లా బాలల రక్షణ అధికారి కేవీ రమణ, స్కూల్‌ అసిస్టెంట్‌ ఎస్‌.ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 11:54 PM