Share News

సమస్యలను పరిష్కరించండి: మంత్రి

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:12 PM

ప్రజా సమస్యలు నేరుగా తెలు సుకొని తక్షణమే పరిష్కరించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు.

 సమస్యలను పరిష్కరించండి: మంత్రి
సంతబొమ్మాళి: అచ్చెన్నాయుడుకు వినతిపత్రం అందజేస్తున్న వాడబలిజ సంఘ నాయకులు :

కోటబొమ్మాళి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు నేరుగా తెలు సుకొని తక్షణమే పరిష్కరించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. గురువారం మండలంలోని నిమ్మాడ క్యాంపుకార్యాలయంలో ప్రజాదర్భార్‌ నిర్వ హించి ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి సంబందింత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోన్‌లో ఆదేశించారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, నంది గాం, కోటబొమ్మాళిమండలాల టీడీపీఅధ్యక్షులు అజయ్‌కుమార్‌, బోయిన రమేష్‌, నాయకులు గొండు లక్ష్మణరావు, మోడీ రామచంద్రరావు పాల్గొన్నారు.

వాడ బలిజ సంక్షేమ కార్పొరేషన్‌ ఏర్పాటుచేయాలి

సంతబొమ్మాళి,జనవరి22(ఆంధ్రజ్యోతి): వాడబలిజ సంక్షేమ కార్పొరేషన్‌ ఏర్పా టు చేయాలని వాడబలిజ మత్స్యకార నాయకులు కోరారు. ఈమేరకు నిమ్మాడలో వాడబలిజ నాయకులు మంత్రి అచ్చెన్నాయుడుకు గురువారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మత్యకార సహకారసంఘం డైరెక్టర్‌ గంట లోకేశ్‌, మేఘవరం నీటిసంఘ ఉపాధ్యక్షులు నూకయ్య, సూరాడ కృష్ణారావు, సూరాడ దాసురాజు, సూరాడ ధనరాజు, వాడబలిజ కులపెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 11:12 PM