విద్యుత్ సమస్యలను పరిష్కరించండి
ABN , Publish Date - May 29 , 2026 | 11:46 PM
పాతపట్నంలో విద్యుత్ లోవోల్టేజీ సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు.
పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
పాతపట్నం, మే 29(ఆంధ్రజ్యోతి): పాతపట్నంలో విద్యుత్ లోవోల్టేజీ సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాతపట్నంలోని క్యాంపు కార్యా లయంలో టీడీపీ శ్రేణులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌బాబు రాజకీయాల్లో మహి ళలకు 33శాతం రిజర్వేషన్ ప్రకటించడంపై గోవిందరావు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మొదలుకొని నేటి వరకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలో పార్టీ ముందుంటుందన్నారు. అనంతరం నిర్వ హించిన ప్రజాదర్బార్‌లో 38 వినతులు అందాయని తెలిపారు.పాతపట్నంలో విద్యుత్ లోవోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని పలువురు వినతిపత్రాలు అందజేశారు. నీలమణి కాలనీ నుంచి అచ్చుతాపురం, అంతరాబ వరకు పలు వీధుల్లో విద్యుత్ లోవోల్టేజ్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నామని పలువురు వివరించారు.