మహిళల సంఘీభావం
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:28 AM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ నేతల వ్యాఖ్యలు, చేష్టలకు మహిళలు నిరసిస్తూ ఎచ్చెర్లలోని శ్రీకాకుళం ఆంధ్ర జ్యోతి కార్యాలయానికి బుధవారం వచ్చి సంఘీభావం ప్రకటించారు.
ఎచ్చెర్ల, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ నేతల వ్యాఖ్యలు, చేష్టలకు మహిళలు నిరసిస్తూ ఎచ్చెర్లలోని శ్రీకాకుళం ఆంధ్ర జ్యోతి కార్యాలయానికి బుధవారం వచ్చి సంఘీభావం ప్రకటించారు. వాస్తవాలను వెలికితీసేందుకు, నిజాలను నిర్భయం రాసేందుకు వెను కాడని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ నేతలు అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా విజయనగరం పార్లమెంటరీ నియో జకవర్గ టీడీపీ ఉపాధ్యక్షురాలు బల్లాడ అరుణ మాట్లాడుతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిత్యం ప్రజల పక్షానే నిలుస్తూ కథనాలను ప్రచురిస్తుంద న్నారు. ప్రజాభిమానం పొందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడులు అప్రజాస్వాకమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నీతిని నిజాయితీని నిలబెట్టు కున్న ఏబీన్ ఆంధ్రజ్యోతికి మహిళల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నా మన్నారు. గత వైసీపీ పాలనలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణిపై వైసీపీ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేశారన్నారు. ఎచ్చెర్ల మండల తెలుగు మహిళా నాయకురాలు గొర్లె కుమారి మాట్లా డుతూ నిష్పక్షపాతంగా వార్తలు రాసే పత్రికపై వైసీపీ నిప్పులు కక్కడం వారి అవివేకానికి నిదర్శమన్నారు. పత్రికా కార్యాలయాలపై దాడులకు ప్రయత్నించడం అనైతికమన్నారు.