Share News

సోలార్‌ విద్యుత్‌ వినియోగం పెరగాలి

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:21 PM

ప్రతి ఇంటిలో సోలార్‌ విద్యుత్‌ వినియోగం పెరగాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

సోలార్‌ విద్యుత్‌  వినియోగం పెరగాలి
సోలార్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు

- ఎమ్మెల్యే గోవిందరావు

మెళియాపుట్టి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటిలో సోలార్‌ విద్యుత్‌ వినియోగం పెరగాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మెళియాపు ట్టిలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి సూర్యఘర్‌ సోలార్‌ విద్యుత్‌ పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు సోలార్‌ వాడకాన్ని పెంచడానికి అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్‌ జయంతి రోజు ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్‌ వెలుగులు ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అఽధికంగా విద్యుత్‌ చార్జీలను పెంచి సామాన్యులకు ఇబ్బందులు పెట్టిందన్నా రు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్థిక కష్టాలు ఉన్నా విద్యుత్‌ చార్జీలు తగ్గించిందన్నారు. నియోజకవర్గానికి ఉచితంగా 3,500 యూనిట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఎస్‌.మోహనరావు, విద్యుత్‌శాఖ ఈఈ నరసింహకుమార్‌, డీఈ ప్రపాదరావు, తహసీల్దార్‌ పాపారావు, ఎంపీడీవో ప్రసాద్‌పండా, టీడీపీ నాయకులు ఎన్‌.వెంకట్రావ్‌, అనపాన రాజశేఖరెడ్డి, దినకర్‌ తదితరులు పాల్గొన్నారు. పాతపట్నంలో బుధవారం అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - Apr 14 , 2026 | 11:21 PM