ప్రకృతి వ్యవసాయంతో భూసారం: ఏడీఏ
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:03 AM
ప్రకృతి వ్యవసాయంతో భూసారం పెరుగుతుందని ఏడీఏ వెంకటమధు తెలిపారు.
నరసన్నపేట, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయంతో భూసారం పెరుగుతుందని ఏడీఏ వెంకటమధు తెలిపారు. శనివారం యరబాడు గ్రామంలో ప్రకృతి సేద్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చిరొట్ట, జీలుగువిత్తనాలు వేయడం ద్వారా భూమికి నత్రజని, భాస్వరంవంటి పోషకాలు సం వృద్దిగా లభిస్తాయన్నారు. వివిర రకాల పంటలను సాగుచేయడం ద్వారా సూక్ష్మ, స్థూల పోషకాలు అందుతాయన్నారు.. కార్యక్రమంలో ఏవో సూర్యకుమారి, వీఏవో లావణ్య, ప్రకృతివ్యవసాయమాస్టర్ ట్రైనర్ రమణ, ఐసీఆర్‌పీ ఆర్.లక్ష్మి పాల్గొన్నారు.