గంజాయితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అరెస్టు
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:34 PM
మందస రోడ్ (హరిపురం) రైల్వే స్టేషన్ వద్ద గంజాయితో సంచరిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అరెస్టు చేసి కేసునమోదు చేసినట్లు కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, మందస ఎస్‌ఐ కె.కష్ణప్రసాద్ తెలిపారు.
హరిపురం, జనవరి7 (ఆంధ్రజ్యోతి): మందస రోడ్ (హరిపురం) రైల్వే స్టేషన్ వద్ద గంజాయితో సంచరిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అరెస్టు చేసి కేసునమోదు చేసినట్లు కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, మందస ఎస్‌ఐ కె.కష్ణప్రసాద్ తెలిపారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా దిగపహాండి బ్లాక్ గోలండా గ్రామానికి చెందిన జగన్నాథ బెహరా(23) బీటెక్ చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా బెంగళూరులో పని చేస్తున్నాడు. డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి రవాణాకు సిద్ధమయ్యా డు. బెంగళూరులోని తన స్నేహితుడు నరేందర్.. జగన్నాథ్‌కు ఫోన్‌చేసి బరంపురంలోని గంగాప్రధాన్ అనేవ్యక్తి వద్ద గంజాయి తీసుకుని రావాలని కోరాడు. దీంతో జగన్నాథ్ బరంపురం వెళ్లి గంజాయిని తీసుకుని బుధవారం ఒక ప్రైవేటు బస్సులో బయలుదేరి హరిపురంలో దిగాడు. విశాఖపట్నం వెళ్లేందుకు రైలు కోసం స్టేషన్‌లో వేచి ఉండగా ఆయన కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని బ్యాగుని పరిశీలించారు. అతని వద్ద మూడు ప్యాకెట్లలో ఉన్న 8 కిలోల గంజాయి పట్టుబడింది. మందస ఎస్‌ఐ కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు తరలించారు.