విద్యతోనే సమాజాభివృద్ధి
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:46 PM
విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు అన్నారు. ఎస్‌ఎస్‌ఆర్‌పురం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు భవనా లను మంగళవారం ప్రారంభించారు.
ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు
ఎచ్చెర్ల, జూన్ 16(ఆంధ్రజ్యోతి): విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు అన్నారు. ఎస్‌ఎస్‌ఆర్‌పురం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు భవనా లను మంగళవారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘వికసిత్ భారత్’లో భాగంగా గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం తది తర మౌలిక సదుపాయాలను కల్పిస్తోందన్నా రు. వైసీపీ ప్రభుత్వంలో నాడు-నేడు పేరిట ని ధులు దుర్వినియోగ మయ్యాయన్నారు. నియో జకవర్గంలో రూ.270 కోట్లతో ప్రతి ఇంటికీ తాగు నీరందించే కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. ఎస్‌ఎస్‌ఆర్‌పురం పంచాయతీలో పారిశుధ్య నిర్వ హణకు మంజూరైన ట్రాక్టర్లను అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పి.సుగుణాకర రావు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, టీడీపీ జిల్లా పూర్వపు అధ్యక్షుడు చౌదరి నారా యణమూర్తి, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ అన్నెపు భువనేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకుడు గాలి వెంకటరెడ్డి, కూటమి నేతలు సంపతిరావు నాగేశ్వరరావు, పైడి ముఖలింగం, జీరు రామా రావు, తహసీల్దార్ బి.గోపాల్, ఎంపీడీవో ఎస్. హరిహరరావు, ఎంఈవో కె.పున్నయ్య, హెచ్‌ఎం టి.విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.