Share News

ప్రభుత్వం, ఎమ్మెల్యే శంకర్‌పై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం

ABN , Publish Date - May 26 , 2026 | 11:23 PM

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై సోషల్‌ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను వన్‌టౌన్‌ పోలీసులు మంగళ వారం అరెస్ట్‌ చేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా పోస్టులు పెడుతున్న వీరిపై కేసు నమోదు చేసినట్లు వన్‌ టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.

 ప్రభుత్వం, ఎమ్మెల్యే శంకర్‌పై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం

విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన ఇద్దరి అరెస్ట్‌

శ్రీకాకుళం క్రైమ్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై సోషల్‌ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను వన్‌టౌన్‌ పోలీసులు మంగళ వారం అరెస్ట్‌ చేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా పోస్టులు పెడుతున్న వీరిపై కేసు నమోదు చేసినట్లు వన్‌ టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని అరస వల్లి ప్రాంతానికి చెందిన పల్లి శ్రీను, ఆదిత్యనగర్‌కు చెందిన కండ్రి అప్పా రావు వైసీపీ అనుబంధ సోషల్‌ మీడియా నిర్వాహకులుగా వ్యవహ రిస్తున్నారు. వీరు సామాజిక మాధ్యమాల్లో ‘మన ఊరి విశేషాలు’, ‘శ్రీకా కుళం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ’ అనే ఖాతాలను నిర్వహిస్తున్నారు. ఈ వేదికల ద్వారా ఎమ్మెల్యే గొండు శంకర్‌ లక్ష్యంగా, అలాగే రాష్ట్ర ప్రభు త్వంపై ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారు. సమా జంలో శాంతిభద్రతలకు భంగం కలిగేలా వివిధ గ్రూపుల్లో నిరం తరం వివాదాస్పద పోస్టులను షేర్‌ చేస్తున్నారు. ఈ సోషల్‌ మీడియా పోస్టు లపై నిఘా ఉంచిన ఖాజీపేటకు చెందిన గొలివి ధనంజయ సదరు వ్యక్తు లపై చర్యలు తీసుకోవాలని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఎస్‌ఐ హరికృష్ణ తక్షణం దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో నిందితులు పల్లి శ్రీను, కండ్రి అప్పారావులపై బీఎన్‌ఎస్‌ 353 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులను బుధవారం న్యాయ స్థానంలో హాజరుపరచ నున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - May 26 , 2026 | 11:23 PM