స్మృతివనం దేశానికే తలమానికం: ఎమ్మెల్యే శంకర్
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:10 AM
శ్రీకాకుళం నగరం లోని శాంతినగర్ కాలనీలో ఏర్పా టు చేసిన గాంధీ మందిరం, స్మృతి వనం దేశానికే తలమానికమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆదివారం గాంధీ మందిరం వద్ద జాతీయపతాక రూపశిల్పి, స్వాతం త్య్ర సమరయోధుడు పింగళి వెం కయ్య జయంతిని నిర్వహించారు. పింగళి వెంకయ్య విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.
పాత శ్రీకాకుళం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరం లోని శాంతినగర్ కాలనీలో ఏర్పా టు చేసిన గాంధీ మందిరం, స్మృతి వనం దేశానికే తలమానికమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆదివారం గాంధీ మందిరం వద్ద జాతీయపతాక రూపశిల్పి, స్వాతం త్య్ర సమరయోధుడు పింగళి వెం కయ్య జయంతిని నిర్వహించారు. పింగళి వెంకయ్య విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. 105 అడుగుల ఎత్తున జాతీయ జెండాను, స్వాతంత్ర సమర యోధులు బిపిన్ చంద్రపాల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలను ఒకేచోట ఏర్పాటు చేసి స్ఫూర్తి కేంద్రంగా రూపొందించడం అభినందనీ యమని, తనవంతు సాయం అందిస్తానన్నారు. విగ్రహ దాతలు డాక్టర్ మధు విలేకర్, గేదెల ఇందిరాప్రసాద్, గుత్తు చిన్నారావులను అభినందించారు. కార్యక్రమంలో మందిరం ప్రతినిధులు బరాటం లక్ష్మణరావు, డాక్టర్ నిక్కు అప్పన్న, కొంక్యాన వేణుగోపాల్, డి.విష్ణుమూర్తి, నిష్టల నరసింహమూర్తి, కొంక్యాన మురళీధర్, పైడి హరనాధరావు, రత్నాల నరసింహమూర్తి, ఎంవీవీఎస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.