‘స్మార్ట్ కిచెన్‌ను విరమించుకోవాలి’
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:04 AM
స్మార్ట్ కిచెన్ సెంటర్ల ప్రతిపాదనను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు.
లావేరు, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి):స్మార్ట్ కిచెన్ సెంటర్ల ప్రతిపాదనను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎంఈవో కార్యాలయ ఆవరణలో సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్వీ రమణ, మధ్యాహ్న భోజన పథకం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి ఉత్తర మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని అన్నారు. అందులో భాగంగా స్మార్ట్ కిచెన్ పేరుతో సామూహిక వంట శాలలు నిర్వహిం చేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తక్షణమే స్మార్ట్ కిచెన్ సెంటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఈవో గట్టు శ్రీరాములుకు వినతిపత్రం అందజేశారు.
రణస్థలం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్ కిచెన్‌లు తక్షణమే రద్దు చేయాలని కోరుతూ సీఐటీయూ నాయకులు శుక్రవారం ఎంఈవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం ఎంఈవో త్రినాథరా వుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువరు మహిళలు పాల్గొన్నారు.