బ్లేడ్‌తో గొంతు కోసుకొని..
ABN , Publish Date - May 14 , 2026 | 12:37 AM
సారవకోట మండలం కురిడింగి గ్రామానికి చెందిన నంబూరి భాస్కరరావు (60) బుధవారం బ్లేడ్‌తో గొంతు కొసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
జలుమూరు (సారవకోట), మే 13(ఆంధ్రజ్యోతి): సారవకోట మండలం కురిడింగి గ్రామానికి చెందిన నంబూరి భాస్కరరావు (60) బుధవారం బ్లేడ్‌తో గొంతు కొసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భాస్కరరావు దీర్ఘకాలిక వ్యాధులైన ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలతో బాఽధపడుతున్నాడు. మందులు వాడుతున్నా ఆరోగ్యం కుదురుకోకపోవడంతో మనస్తాపానికి గురైన భాస్కరరావు బుధవారం బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. దీన్ని కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే 108 వాహనంలో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.