చేపలవేటకు వెళ్తూ జారిపడి..
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:12 AM
Fisherman from Nuvvalarevu dies off the Karnataka coast. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవుకు చెందిన బైనపల్లి బొన్న(40) అనే మత్స్యకారుడు కర్నాటక రాష్ట్రం మలిపి తీరంలో చేపలవేటకు వెళ్లి.. ప్రమాదవశాత్తూ బోటు నుంచి జారిపడి మృతి చెందాడు.
కర్ణాటక తీరంలో నువ్వలరేవు మత్స్యకారుడి మృతి
వజ్రపుకొత్తూరు, జూలై 21(ఆంధ్రజ్యోతి): వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవుకు చెందిన బైనపల్లి బొన్న(40) అనే మత్స్యకారుడు కర్నాటక రాష్ట్రం మలిపి తీరంలో చేపలవేటకు వెళ్లి.. ప్రమాదవశాత్తూ బోటు నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ నెల 17న బొన్న తోటి మత్స్యకారులతో చేపల వేటకు వెళ్లి.. బోటు నుంచి జారిపడి సముద్రంలో గల్లంతయ్యాడు. తోటి మత్స్యకారులు గాలించినా ఫలితం లేకపోయింది. ఈ నెల 19న రాత్రి ఆయన మృతదేహం తీరానికి కొట్టుకువచ్చింది. సమాచారం కుటుంబ సభ్యులకు అందడంతో నువ్వలరేవులో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య జానకి, కుమార్తె ఉమా బోరున విలపించారు. ఉపాధి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయాడని, ఇక తమకు దిక్కెవరని రోదించారు. మృతుడి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. మత్స్యశాఖ అధికారులు, గ్రామపెద్దలను బొన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వ సాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.