Share News

వెట్టిచాకిరీని నిషేధించాలి

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:51 PM

సమాజంలో వెట్టిచాకిరీని నిషేధించాలని కొత్తూరు కోర్టు మండల లీగల్‌ సర్వీసెస్‌ అథారటీ, న్యాయా ధికారి కందికట్ల రాణి అన్నారు.

వెట్టిచాకిరీని నిషేధించాలి
టెక్కలిరూరల్‌:ఇటుకల బట్టి యజమానులతో మాట్లాడుతున్న న్యాయాధికారి నిర్మల

హిరమండలం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): సమాజంలో వెట్టిచాకిరీని నిషేధించాలని కొత్తూరు కోర్టు మండల లీగల్‌ సర్వీసెస్‌ అథారటీ, న్యాయా ధికారి కందికట్ల రాణి అన్నారు. శనివారం సుభలయి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటుక, సిమెంట్‌ పరిశ్రమలు, మందుగుండు తయారీ ఫ్యాక్టర్టీల్లో మహిళలు, చిన్న పిల్లలు వెట్టిచాకిరీ చేస్తూ బలవుతున్నారన్నారు. ఇది చట్ట ప్రకారం నేరమైన చర్య అని అన్నారు. కార్యక్రమంలో కొత్తూరు బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎం. అప్పారావు, న్యాయవాదులు జానకీరామ్‌, ప్రసాద్‌, రాజు, హరిబాబు, ఉపాధివేతనదారులు తదితరులు పాల్గొన్నారు.

వెట్టిచాకిరీ చట్టరీత్యా నేరం

టెక్కలిరూరల్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): వెట్టిచాకిరీ చట్టరీత్యానేరమని టెక్క లి సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బి.నిర్మల అన్నారు. శనివారం ధర్మానీలాపు రంలో ఇటుక బట్టిలను తనిఖీ చేశారు. బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు తీసుకుంటామని ఇటుక బట్టిల నిర్వాహకులను హెచ్చరించారు. కార్యక్రమంలో బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.అజయ్‌కూమార్‌, ఏపీజీ వివేక్‌, ఎప్‌ఐ రాము, తదితరులు పాల్గొన్నారు.

వివాహ బంధాన్ని కాపాడుకోవాలి

కోటబొమ్మాళి, మార్చి 7 (ఆంధ్ర జ్యోతి): వివాహబంధం అత్యంత పవిత్రమైనదని, దానిని కాపాడుకో వాల్సిన బాధ్యత భార్యభర్తలు ఇద్ద రిపైనా ఉందని స్థానిక సీనియర్‌ న్యాయవాది కవిటి మన్మథరావు అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక వెలుగు కార్యాలయంలో స్వయంశక్తి సంఘాల సభ్యులతో ఆయన న్యా యవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. భార్యకు చట్టరీత్యా విడాకులు ఇవ్వకుండా భర్త వేరొక మహిళను వివాహం చేసుకోవడం నేరమన్నారు. నిరాదరణకు గురైన భార్యలు తమ భర్తల నుంచి భరణం పొందేందుకు కోర్టును ఆశ్రయించ వచ్చునని అన్నారు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం సూర్యనారాయణ, మహిళ మండలి అధ్యక్షురాలు హెచ్‌.శర్వాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 11:51 PM