Share News

అరసవల్లి క్షేత్రంలో నరకాసుర వధ

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:09 AM

నరక చతుర్దశి సందర్భంగా శనివారం రాత్రి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో నరకాసుర వధ కార్యక్రమం నిర్వహించారు.

అరసవల్లి క్షేత్రంలో నరకాసుర వధ
స్వామివారి తిరువీధి నిర్వహిస్తున్న అర్చకులు

అరసవల్లి నవంబరు 7(ఆంధ్రజ్యోతి): నరక చతుర్దశి సందర్భంగా శనివారం రాత్రి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో నరకాసుర వధ కార్యక్రమం నిర్వహించారు. ఉష, పద్మిని, ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి ఉత్సవ మూర్తులకు తిరువీధిగా ఆలయ ఉద్యానవనానికి తీసుకువచ్చారు. అనంతరం గణపతి పూజతో కార్య క్రమాన్ని ప్రారంభించారు. లక్ష్మీనారాయణులకు పురు షసూక్త విధానంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో నరకాసురుడి దిష్టిబొమ్మను దహనం చేసి ఉత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక క్షేమం కోసం, శాంతి సమృద్ధి కోంం ప్రతిఏటా ఈ ఉత్సవం నిర్వహిం చడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వ హణాధికారి కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

ఆదిత్యాలయంలో మహా లింగార్చన

అరసవల్లి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో శనివారం మహా లింగార్చన ఘనంగా నిర్వ హించారు. ప్రధానార్చకుడు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితుల వేద మంత్రాల నడుమ చేపట్టారు. కార్యక్రమంలో అర్చ కులు ఇప్పిలి షణ్ముఖ శర్మ, సాందీప శర్మ, రంజిత్‌ శర్మ, వికాస్‌ శర్మ, పార్థసారథి శర్మ, రామకృష్ణ శర్మ, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2026 | 01:09 AM