విధుల్లోకి ఆరుగురు కార్మికులు
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:03 AM
వరిసాం శ్యామ్ పిస్టన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొంతకాలంగా కార్మికులు పోరా టం చేస్తున్న సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు చొరవ చూపారు.
సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ
రణస్థలం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): వరిసాం శ్యామ్ పిస్టన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొంతకాలంగా కార్మికులు పోరా టం చేస్తున్న సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు చొరవ చూపారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమ ప్రతినిధులతో చర్చించారు. 30 ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకుని తొలగించిన కార్మికులను తిరిగి తీసుకునే విషయమై జీసీఎల్ కోర్టులో ఉన్నందున తీర్పు వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని యాజమాన్య ప్రతి నిధులు తెలిపారు. వివిధ కారణాలతో ఇటీవల ఏడుగురు కార్మికులను తొలగించగా వారిలో ఒకరికి 30 ఏళ్ల సర్వీసు పూర్త యినందున అత డిని పక్కన పెట్టి మిగిలిన ఆరుగురిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. 2018 నుంచి చేపట్టాల్సిన వేతన సవరణపై కార్మిక సంఘ నేతలు ప్రస్తా వించగా ఉత్పత్తి బాగా జరిగితే అక్టోబరులో వేతన సవరణ చేసి నవంబరులో చెల్లిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సమ స్యల పరిష్కారానికి చొరవ తీసుకున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ను కార్మికులు అభినందించారు. కార్య క్రమంలో ఏజీఎం పి.శివకుమార్, హెచ్‌ఆర్ మేనేజర్ బి.జనార్దన నాయుడు, సీఐ ఎం.అవ తారం, కార్మిక సంఘ నేతలు పాల్గొన్నారు.
ఆదుకోవాలని దస్తావేజు లేఖర్ల వినతి
రణస్థలం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): దస్తావేజు లేఖరులను ఆదుకోవాలని ఆ సంఘం నేతలు కోరారు. ఈ మేరకు సంఘం ప్రతినిధులు రాజా పంతుల సూర్యప్రకాశరావు, పి.వెంకటేశ్వర రావు తదితరులు బుధవారం ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావుకు వినతిపత్రం అందించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం జీవో 396 విడుదల చేసిందని, దీనివల్ల లేఖర్లు వీధిన పడతారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ జీవో రద్దుకు కృషి చేయాలని కోరారు. కార్య క్రమంలో రిజిస్ట్రేషన్‌ల సంఘ ప్రతినిధులు ఆర్. మౌళీశ్వరరావు, ఎస్.శివకుమార్, అరసాడ విజ యసారధి, మల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.