ప్రతిపాదిత బీచ్ రోడ్డు ప్రాజెక్టు స్థల పరిశీలన
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:58 PM
శ్రీకాకుళం నగరం నుంచి పెద్ద గనగళ్లపేట బీచ్ వర కు ప్రతిపాదించిన నూతన రహదారి ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి గురువారం పరిశీలించారు.
శ్రీకాకుళం అర్బన్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరం నుంచి పెద్ద గనగళ్లపేట బీచ్ వర కు ప్రతిపాదించిన నూతన రహదారి ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి గురువారం పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రా రంభమయ్యే ఈ నూత న బీచ్ రోడ్డు మార్గాన్ని వారు సునిశితంగా పరిశీ లించారు. నదికి 50 మీటర్ల భద్రతా దూరాన్ని పాటిస్తూ ఈ మార్గం నిర్మించనున్నట్టు తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక సూచనలతో ఈ నూతన రహదారి ప్రాజెక్టు చేపడుతున్నామన్నా రు. కల్లేపల్లి, కునుకుపేట, కిల్లిపాలెం, పీజీపేట గ్రామాల మీదుగా సుమారు 9 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు సాగుతుందన్నారు. ఈ మార్గం వెంబడి ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు సైకిల్ ట్రాక్‌లు, వాకింగ్ స్పేస్‌లు తదితర సదుపాయాలు ఈ ప్రాజెక్టులో పొందుపరుస్తు న్నట్లు తెలిపారు. రహదారి నిర్మాణంలో భూము లు కోల్పోతున్న రైతులతో గొండు శంకర్ స్వయం గా మాట్లాడారు. అభివృద్ధి కోసం భూములు ఇవ్వడానికి రైతులు సముఖత వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.