ఫిష్‌ల్యాండింగ్ సెంటర్ కోసం స్థల పరిశీలన
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:42 PM
: మండలంలోని ఎకువూరు తీరంలో రూ.ఐదుకోట్ల అంచనావ్యయంతో నిర్మించనున్న ఫిష్‌ల్యాండింగ్ సెంటర్‌కు మత్స్య, రెవెన్యూ అధికారులు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు.
సోంపేట రూరల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎకువూరు తీరంలో రూ.ఐదుకోట్ల అంచనావ్యయంతో నిర్మించనున్న ఫిష్‌ల్యాండింగ్ సెంటర్‌కు మత్స్య, రెవెన్యూ అధికారులు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సీఎస్‌ఆర్‌నిధులతో ఎకువూరు తీరంలో రెండున్నర ఎకరాల్లో ఫిష్ ల్యాండింగ్‌సెంటర్ నిర్మించనున్నట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. కోల్ట్‌స్టోరే జ్, ఐస్‌ప్లాంట్, నెట్ మెండింగ్‌షెడ్, పడవల మరమ్మతులు, వేలం హాల్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. మత్స్యకారుల జీవనోపాధి పెంచేం దుకు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని ఎకువూ రుకు చెందిన తీరప్రాంత మత్స్యకారఐక్యవేదిక ఇచ్ఛాపురం అధ్యక్షుడు బడే తమ్మా రావు తెలిపారు. నివేదిక వారంరోజుల్లో ప్రభుత్వానికి పంపించి అనుమతులు రాగానే టెండర్లు పిలుస్తామని మత్స్యశాఖ జేడీ సత్యనారాయణ తెలిపారు. స్థల పరిశీలనలో తహసీల్దార్ అప్పలస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్, ఫిషరీస్ అధికారులు, ఎకువూరు మత్స్యకార సంఘం నాయకులు పాల్గొన్నారు.