చాపురంలో మహానాడుకు స్థల పరిశీలన
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:07 AM
Mahanadu.. Site inspection జిల్లాలో టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహణకు ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం మండలం చాపురంలో మహానాడు వేదికకు అనువైన స్థలాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు.
ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్
పాత శ్రీకాకుళం, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహణకు ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం మండలం చాపురంలో మహానాడు వేదికకు అనువైన స్థలాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన వేదిక ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి సరఫరా, ప్రజాప్రతినిధుల వసతి, భద్రతా చర్యలు వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలలు నుంచి లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొనే మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. లోటుపాట్లు లేకుండానే ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ మహానాడు ద్వారా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, పంచిరెడ్డి అప్పలనాయుడు, అల్లు నరసయ్య, కూటమి నేతలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.