Share News

నార్కోటిక్స్‌ భవన నిర్మాణానికి స్థల పరిశీలన

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:45 PM

జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు మందు నిర్మూలన లక్ష్యంగా చేపట్టే దాడుల్లో లభించిన పదార్థాలను నిల్వ చేసేందుకు (నార్కో టిక్స్‌) నూతన భవన నిర్మాణం చేప ట్టేందుకు గాను స్థలాన్ని పరిశీలించారు.

నార్కోటిక్స్‌ భవన నిర్మాణానికి స్థల పరిశీలన
స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఫస్ట్‌క్లాస్‌ ఏడీజే న్యాయాధికారి పి.భాస్కర రావు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు మందు నిర్మూలన లక్ష్యంగా చేపట్టే దాడుల్లో లభించిన పదార్థాలను నిల్వ చేసేందుకు (నార్కో టిక్స్‌) నూతన భవన నిర్మాణం చేప ట్టేందుకు గాను స్థలాన్ని పరిశీలించారు. శనివారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఫస్ట్‌క్లాస్‌ ఏడీజే కోర్టు న్యాయాధికారి పి.భాస్కర రావు ఎస్పీ కార్యాలయం పక్కన ఉన్న నాలుగు సెంట్ల స్థలానికి కొలతలు వేయించి పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో కోర్టు సూపరింటెం డెంట్లు చంద్రశేఖరరావు, శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ డీఈ ధనుంజయ, తహసీ ల్దార్‌ గణపతిరావు, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:45 PM