మహానాడుకు చాపురం వద్ద స్థల పరిశీలన
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:06 AM
శ్రీకాకుళంలో నియోజక వర్గంలో మహానాడు నిర్వహణకు గాను అనువైన ప్రదేశాల ఎంపికపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో బుధవారం శ్రీకా కుళం నగరంలో విలీన పంచాయతీ చాపురం సమీపంలో హైవేకి ఆను కుని ఉన్న స్థలాలను ఎమ్మెల్యే గొండు శంకర్ తహసీల్దార్ గణపతిరావుతో కలిసి పరిశీలించారు.
పాత శ్రీకాకుళం, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో నియోజక వర్గంలో మహానాడు నిర్వహణకు గాను అనువైన ప్రదేశాల ఎంపికపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో బుధవారం శ్రీకా కుళం నగరంలో విలీన పంచాయతీ చాపురం సమీపంలో హైవేకి ఆను కుని ఉన్న స్థలాలను ఎమ్మెల్యే గొండు శంకర్ తహసీల్దార్ గణపతిరావుతో కలిసి పరిశీలించారు. మహానాడుకు అవసరమైన ప్రాంగణం, వాహనాల పార్కింగ్, రాకపోకలకు మార్గాలు, తాగునీరు, విద్యుత్ తదితర సదుపా యాల కల్పనపై చర్చించారు. అలాగే అత్యవసర సేవలపై చర్చించారు. మహానాడు నిర్వహణకు అనువైన ప్రదేశాన్ని త్వరలో ఖరారు చేయను న్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పంచిరెడ్డి అప్పల నాయుడు, అల్లు సరసయ్య, మట్ట అనందరావు, మట్ట రమేష్, మట్ట పాపారావు, అల్లు దాళప్పడు, జల్లెపల్లి రామారావు పాల్గొన్నారు.