పీఎండీఎస్‌తో ఏకకాలంలో బహుళ పంటలు
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:53 PM
పీఎండీఎస్‌తో ఏక కాలంలో బహుళ పంటలు సాగుచేయ వచ్చని ‘రైతన్న మీకోసం’ ప్రోగ్రాం రాష్ట్ర ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు.
‘రైతన్న మీకోసం’ ప్రోగ్రాం రాష్ట్ర ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు
ఎచ్చెర్ల, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): పీఎండీఎస్‌తో ఏక కాలంలో బహుళ పంటలు సాగుచేయ వచ్చని ‘రైతన్న మీకోసం’ ప్రోగ్రాం రాష్ట్ర ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. ఎచ్చెర్ల, కేశవరావుపేట గ్రామాల్లో పీఎండీఎస్ విధానంలో సాగుచేస్తున్న పొలాలను గురువారం పరిశీలిం చారు. పోషక విలువలతో కూడిన నవధాన్య పంటలు పశువులకు పచ్చి మేతగా ఉపయోగపడతా యన్నారు. ఈ విధానంలో ఒక ఎకరా పొలంలో 9 రకాలకు చెందిన 30 జాతులు సాగు చేయవచ్చన్నారు. నేల కోతకు గురికాదని, నేలలో నీటిని నిల్వ సామర్ధ్యం పెరుగుతుందన్నారు. ప్రధాన పంటల్లో కలుపు సమస్య ఉండదని, అలాగే నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ కె.రాజగోపాల్, డీడీ డాక్టర్ ఎస్.సూర్యనారాయణ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ వీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.