Share News

సిక్కోలు అవకాశాల గని

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:59 PM

జిల్లాను ఇకపై ఎవరూ వెనుకబడిన ప్రాంతంగా చూడకూడ దని, సిక్కోలు అపారమైన అవకాశాలకు నెలవని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

 సిక్కోలు అవకాశాల గని
వివిధ కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులతో కేంద్ర మంత్రి రామ్మోహన్‌, ఎమ్మెల్యేలు

- ఇకపై వెనుకబడిన జిల్లాగా చూడొద్దు

- దక్షిణ భారత సీఎస్‌ఆర్‌ సదస్సులో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాను ఇకపై ఎవరూ వెనుకబడిన ప్రాంతంగా చూడకూడ దని, సిక్కోలు అపారమైన అవకాశాలకు నెలవని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. నగర శివారులోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం ‘ట్రైనీ లూప్‌’, ‘బచ్‌పన్‌ బచావో’ సంస్థల ఆధ్వర్యంలో దక్షిణ భారత 3వ సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌) సదస్సు ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కేం ద్రమంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ‘పీ-4’ స్ఫూర్తి, ప్రధాని మోదీ ‘వికసిత భారత్‌’ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ పున రంకితం కావాలని పిలుపునిచ్చారు. పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ చొరవ, కృషితో 50 స్వచ్ఛంద సంస్థలు, 13 దిగ్గజ కార్పొరేట్‌ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నా రు. ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సీఎస్‌ఆర్‌ సెల్‌ ద్వారా నియోజకవర్గాల వారీగా అభి వృద్ధి పనులకు సిద్ధంగాఉన్నట్లు ప్రకటించారు. జిల్లా పారిశ్రామిక పెట్టుబడులకు అత్యుత్తమ ప్రాంత మని పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ స్పష్టం చేశారు. వంశధార, నాగావళి నదులతో పాటు అద్భు తమైన రవాణా వసతులు ఉన్నాయన్నారు. పరిశ్ర మల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి కల్పించ డమే లక్ష్యమన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు కార్పొరేట్‌ సంస్థలు ముందుకు రావాలని ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌, ఎమ్మెల్యే లు గొండు శంకర్‌, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు కోరారు. జిల్లాలో ఇప్పటికే రూ.41.44 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులు వినియోగించామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. మరో రూ.45 కోట్లతో సరికొత్త ప్రాజెక్టులకు నివేదికలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆర్డీఓ సాయిప్రత్యూష, వివిధ కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 11:59 PM