భూకబ్జాలపై సీదిరి సమాధానం చెప్పాలి
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:38 PM
నియోజక వర్గంలో జరుగుతున్న హత్యా రాజకీయాలు, భూకబ్జాలపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రజలకు సమాధానంఇవ్వాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష డిమాండ్ చేశారు.
పలాస, జనవరి 13(ఆంధ్రజ్యోతి): నియోజక వర్గంలో జరుగుతున్న హత్యా రాజకీయాలు, భూకబ్జాలపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రజలకు సమాధానంఇవ్వాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష డిమాండ్ చేశారు. ఈమేరకు మం గళవారంఆమె సోషల్‌మీడియా వేదికగా మాట్లా డారు. పలాసలో జరగుతున్న భూ కబ్జాలు, చెరు వుల ఆక్రమణలపై పది రోజుల కిందట ఆంధ్ర జ్యోతి, మరో పత్రిక కథనంపై తాను కలెక్టర్‌ను కలుసుకొని ప్రత్యేక అధికారి నియమిం చాలని కోరినట్లు తెలిపారు. మాజీ మంత్రి అప్పలరాజు పలాస కబ్జాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం సంతోషమని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొల్లగొట్టి జోబులో వేసుకున్న నల్లబొడ్లూరు. ఉజ్జుడుకొండ కంకర తవ్వకాలపై కూడా కలెక్టర్‌కు అడిగి ఉంటే మీకు నమ్మేవాళ్లమన్నారు. స్వయంగా సెలక్ట్ చేసి మునిసిపల్ వైస్‌చైర్మన్‌గా మీసాల సురేష్‌బాబును నియమించారని, రైల్వేలో చిన్న కాంట్రాక్టు రాలేదని వారి కుటుంబీకులతో వెళ్లి మారణా యుదాలతో ఎదుటి వ్యక్తులను హతమార్చాలని చూసారని, దీనిపై మాట్లాడి ఉంటే సంతోషపడేవారమన్నారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు బడ్డ నాగరాజును హత్య చేయడానికి బీహార్ నుంచి ఇద్దరు కరుడుగట్టిన నేర స్థులను తీసుకువచ్చి తుపాకులతో దాడికి యత్నించారని ఆరోపించారు. అనంతరం వైసీపీ నాయకులు అరెస్టయితే వారందరికి బెయిల్‌పై తీసు కువచ్చిన ఘనత మీకుందని గుర్తు చేశారు. మీ సొంత పార్టీకి చెందిన వైస్‌చైర్మన్ సిగ్గుపడకుండా బరితెగించి మారణాయుధాలతో వ్యక్తులను చంపడానికి వెళ్లినప్పుడు వారి గురించి ఏమి మాట్టాడతారో చెబితే వినా లని ఉందన్నారు.ఒక ఆడపిల్లగా తమపై నమ్మకంతో ఓటు వేసిన ప్రజ లకు తాము భరోసా ఇస్తున్నామని తెలిపారు. పలాస ప్రశాంతతకు భంగం కలిగిస్తే ప్రజల సహకారంతో వారికి జైలుకు పంపించడం ఖాయమన్నారు. సురేష్ వంటి వాళ్లకు భయపడవద్దని, వారిని ఎదురించి కేసు పెట్టిన వారికి అభినందించారు. పలాస పరిరక్షణ అందరికీ ఉండాలని, సంఘ విద్రోహ శక్తులను పలాస నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.