నకిలీ బంగారం ఆభరణాలు చూపి
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:03 AM
రణస్థలం లో నకిలీ బంగారు ఆభరణాలు చూపించి దఫద ఫాలుగా డబ్బులివ్వాలని ఓ షాపు యజమానికి ఎరచూపిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.
దఫదఫాలుగా డబ్బులివ్వాలని మోసానికి యత్నం
అప్రమత్తమైన వ్యాపారి
పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు
రణస్థలం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రణస్థలం లో నకిలీ బంగారు ఆభరణాలు చూపించి దఫద ఫాలుగా డబ్బులివ్వాలని ఓ షాపు యజమానికి ఎరచూపిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. వన్‌గ్రామ్ బంగారం షాపు యాజమని రమణ, జేఆర్ పురం పోలీసుల కథనం మేరకు.. రణస్థలంలో నాలుగు రోజుల కిందట బంగారం విక్రేతల పేరిట స్థానిక వ్యాపారులకు ఇ ద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. ఈ క్రమంలో కిలో బంగారం విక్రయం పేరుతో ఆ ఇద్దరు శనివారం వన్‌గ్రామ్ బంగారం షాపు యాజమాని రమణ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా కిలో నకిలీ బంగారం ఆభరణాలు చూపించారు. ఇది బంగారమని నమ్మబలికి తొలు త రూ.రెండు లక్షలు ఇచ్చి, దఫదఫాలుగా మిగిలి న డబ్బులు ఇవ్వాలని సదరు వ్యక్తులు కోరారు. వారిపై అనుమానం వచ్చి రమణ స్థానికుల సహకారంతో ఆ నకిలీ బంగారం వ్యాపారులను పట్టుకుని జేఆర్ పురం పోలీసులకు అప్పగిం చారు. ఆ ఇద్దరూ తెలుగులో సరిగా మాట్లాడలేక పోతున్నారు. ఈ ఘటనపై విచారణ చేపడు తున్నట్టు జేఆర్ పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి తెలిపారు.