శ్మశానానికి దారి చూపండి
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:17 AM
మండల కేంద్రమైన కవిటిలో ఉన్న శ్మశానవాటికకు దారి చూపాలని గ్రామ స్థులు శుక్రవారం నిరసన తెలిపారు.
గ్రామస్థుల నిరసన
కవిటి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన కవిటిలో ఉన్న శ్మశానవాటికకు దారి చూపాలని గ్రామ స్థులు శుక్రవారం నిరసన తెలిపారు. గొండ్యాలపుట్టుగ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా మృతదేహాన్ని తీసుకు వెళ్లేం దుకు వీలు కలుగలేదు. దాని పక్కనే ఉన్న వీధి నుంచి వెళ్లేం దుకు ప్రయత్నింగా స్థానికులు ప్రశ్నిం చడంతో తీవ్ర ఇబ్బం దులు పడి ఎట్టకేలకు శ్మశాన వాటికకు తీసుకువెళ్లారు. ఇది లా ఉండగా శ్మశానవాటికకు గతంలో రోడ్డు ఉండేది. అయితే కవిటిలో అమ్మవారి ఉత్సవాలు జరిగేప్పుడు ఈ రోడ్డు మీదు గా రాకపోకలు సాగించేందుకు వీలుగా అక్కడ రెండు చెక్ డ్యాం వాల్స్‌ను ఎత్తు చేశారు. ఆ తర్వాత రోడ్డు నిర్మించకుం డా మధ్యలోనే వదిలేశారు. దీంతో కొన్ని నెలలుగా శ్మ శానానికి వెళ్లేందుకు ఇబ్బం దులు ఎదురవు తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణా నికి చర్యలు తీసు కోవాలని కవిటి, గొండ్యాల పుట్టుగ, రామయ్యపుట్టుగ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.