Share News

న్యాయ అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - May 06 , 2026 | 11:44 PM

పారాలీగల్‌ వలంటీర్లు న్యాయ అవగాహనతో పని చేయా లని 3వ అదనపు జిల్లా న్యాయాధి కారి సీహెచ్‌ వివేకానందశ్రీనివాస్‌ అన్నారు.

 న్యాయ అవగాహన కలిగి ఉండాలి
మాట్లాడుతున్న 3వ అదనపు జిల్లా న్యాయాధికారి సీహెచ్‌ వివేకానందశ్రీనివాస్‌

3వ అదనపు జిల్లా న్యాయాధికారి వివేకానందశ్రీనివాస్‌

శ్రీకాకుళం లీగల్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): పారాలీగల్‌ వలంటీర్లు న్యాయ అవగాహనతో పని చేయా లని 3వ అదనపు జిల్లా న్యాయాధి కారి సీహెచ్‌ వివేకానందశ్రీనివాస్‌ అన్నారు. స్థానిక న్యాయ సేవాసదన్‌ లో పారా లీగల్‌ వలంటీర్లకు నిర్వహిం చిన మూడురోజుల శిక్షణ శిబిరం బుధ వారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ చట్టాలపై వలం టీర్లకు కనీస అవగాహన అవసరమన్నారు. మో టార్‌ వాహనాలు, పోక్సో, దివ్యాంగుల చట్టం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లాన్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరి బాబు, ఎంవీఐ పీవీ గంగాధర్‌, విద్యా ఫౌండేషన్‌ ప్రతినిధి ప్రసాద్‌, సీఐ నారీమణి, దివ్యాంగుల సంక్షేమ అధికారి బి.దేవరాజ్‌, న్యాయవాదులు క్రాంతి, అన్నెపు భువనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 11:44 PM