Share News

నటనపై ఆసక్తి పెంచుకోవాలి

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:19 AM

ప్రస్తుత కాలంలో సినిమా ల్లోకి వచ్చే కొత్తవా రు నటనపై ఆసక్తి పెంచుకోవాలని, చక్కని డైలాగ్‌ డెలి వరీ, హావభావాలు పలికించి రాణించా లని సూచించారు.

నటనపై ఆసక్తి పెంచుకోవాలి
శివాజీరాజాను సత్కరిస్తున్న దృశ్యం

  • సినీనటుడు శివాజీరాజా

పలాస రూరల్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత కాలంలో సినిమా ల్లోకి వచ్చే కొత్తవా రు నటనపై ఆసక్తి పెంచుకోవాలని, చక్కని డైలాగ్‌ డెలి వరీ, హావభావాలు పలికించి రాణించా లని సూచించారు. పలాస మండలంలో డొక్కా కృష్ణారావు దర్శకత్వంలో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు పలాస వచ్చిన ఆయనను బుధవారం ఏపీ తెలు గు ఫిలిమ్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కుమార్‌ నాయక్‌ సత్కరిం చారు. ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ.. సుమారు 500 చిత్రాల్లో తాను నటించానని తెలిపారు. పలాస ప్రాంతంలో ప్రేక్షకులు ఎంతో చక్కగా షూటింగ్‌లకు సహకరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ బృందం ఆయనకు దుశ్శాలువ కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ ఫిలిమ్‌ ఫెడరేషన్‌ సభ్యులు కొండల ప్రకాష్‌, షేక్‌ రాజాబాబు, మేకప్‌ ఆర్టిస్టు ఈశ్వర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 12:19 AM