ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:48 PM
హరిపురంలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు, ఒత్తిడి లేని చదువు లభిస్తుందని విద్యార్థులు, ఉపా ధ్యాయులు సోమవారం ర్యాలీ చేపట్టారు.
హరిపురం, జనవరి26 (ఆంధ్రజ్యోతి): హరిపురంలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు, ఒత్తిడి లేని చదువు లభిస్తుందని విద్యార్థులు, ఉపా ధ్యాయులు సోమవారం ర్యాలీ చేపట్టారు. హరిపురంలో ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఎస్.విజయ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి మనబడిని మనం కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో బైరిశెట్టి గున్నయ్య, పుల్లా వాసు, విశ్వనాఽథం, కోదండరా వు, కన్నయ్య, చంద్రశేఖర్, మట్ట ఖగేశ్వరరావు, సోమనాధం పాల్గొన్నారు.
.