ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:52 PM
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసు కోవాలని, వాటి పరిష్కారానికి కృషిచేయాలని పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరా రు.
ఆమదాలవలస, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసు కోవాలని, వాటి పరిష్కారానికి కృషిచేయాలని పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరా రు. శనివారం ఆమదాలవలసలో మండలానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో జనసేన నియో జకవర్గం ఇన్చార్జి, మార్కెట్ కమిటీ చైర్మన్ పేడాడ రామ్మోహన్రావు, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ సూరపునాయుడు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మినేని సుజాత, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, ఢిల్లేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు నూకరాజు పాల్గొన్నారు.
ఫపొందూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ కోరారు. పొందూరులో స్థానిక ఎన్నికలపై కూటమి పార్టీ నాయకులతో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో 21 ఎంపీటీసీలను కైవసం చేసుకుని ఎంపీపీపీఠాన్ని సాధించాలని సూచిం చారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి సూరపునాయుడు, జనసేన ఇన్చార్జి పి.రామ్మోహన్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కె. సత్యారావు, రామ్మోహన్, అన్నెపు రాము, శంకర్భాస్కర్, శ్రీరంగనాయకులు, గిరి, కృష్ణ వాసుదేవరావు పాల్గొన్నారు.