టెక్కలిలో వైసీపీకి షాక్
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:42 AM
టెక్కలిలో వైసీపీకి షాక్ తగిలింది. మండలంలోని సీతాపురం, తిర్లంగి పంచాయతీల పరిధిలో వైసీపీకి చెందిన 500 కుటుంబాలు ఆదివారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి.
- మంత్రి సమక్షంలో 500 కుటుంబాలు టీడీపీలో చేరిక
కోటబొమ్మాళి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): టెక్కలిలో వైసీపీకి షాక్ తగిలింది. మండలంలోని సీతాపురం, తిర్లంగి పంచాయతీల పరిధిలో వైసీపీకి చెందిన 500 కుటుంబాలు ఆదివారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి మంత్రి టీడీపీ కండువాలు వేసి సాదరగా ఆహ్వానించారు. సీతాపురం పంచాయతీ పరిధిలోని వీర రామమకృష్ణాపురం, తిర్లంగి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరడంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. టెక్కలి నియోజకవర్గంతో పాటు గతంలోని హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో దాదాపుగా 44 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తోందని మంత్రి తెలిపారు. సీతాపురం, వెంకటాపురం గ్రామంలో గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరి, బెండి శ్రీనివాసరావు, బెండి అప్పలసూర్యనారాయణ, టి.జగ్గారావు, బెండి కామరాజు, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.