శంభో శంకర
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:17 AM
Chanting the name of Shiva దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన.. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం.. శివనామస్మరణతో మార్మోగింది. కార్తీక మాస తొలిసోమవారం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు ఆలయా నికి తరలివచ్చారు. ‘శంభోశంకర.. హరహర మహదేవా’.. అంటూ శివుడ్ని పూజించారు.
శ్రీముఖలింగంలో మార్మోగిన శివనామస్మరణ
రావివలసకు పోటెత్తిన భక్తులు
జలుమూరు/ టెక్కలి రూరల్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన.. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం.. శివనామస్మరణతో మార్మోగింది. కార్తీక మాస తొలిసోమవారం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు ఆలయా నికి తరలివచ్చారు. ‘శంభోశంకర.. హరహర మహదేవా’.. అంటూ శివుడ్ని పూజించారు. కొంతమంది భక్తులు వంశధార నదిలో స్నానాలు ఆచరించి.. శ్రీముఖలింగేశ్వరుడ్ని దర్శించుకున్నారు. జిల్లాతోపాటు.. ఒడిశా నుంచి సైతం భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. ఆలయం బయట షామియానాలు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఎండలో అవస్థలు పడ్డారు. నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ అశోక్‌బాబు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే టెక్కలి మండలం రావివలసలో ఎండలమల్లన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
