Share News

శంభో శంకర

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:20 AM

Shivaratri celebrations మహాశివరాత్రి పర్వదినం వేళ.. ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. జిల్లా అంతటా వేడుకలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. జలుమూరు మండలం శ్రీముఖలింగం.. భక్తజన సంద్రమైంది.

శంభో శంకర
జలుమూరు : శ్రీముఖలింగంలో క్యూలో బారులుదీరిన భక్తులు

శ్రీముఖలింగం.. భక్త జనసంద్రం

జిల్లాఅంతటా శివరాత్రి వేడుకలు

ఆలయాల్లో మార్మోగిన శివనామ స్మరణ

జలుమూరు, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వదినం వేళ.. ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. జిల్లా అంతటా వేడుకలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. జలుమూరు మండలం శ్రీముఖలింగం.. భక్తజన సంద్రమైంది. ఆదివారం వేకువజామున 4 గంటల నుంచే భక్తులు క్యూలో బారులుదీరారు. శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష, దేవదాయశాఖ అసిస్టెంటు కలెక్టర్‌ ప్రసాద్‌ పట్నాయక్‌ నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌ నుంచి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పర్యవేక్షించి.. పలు సూచనలు చేశారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు నేతృత్వంలో జలుమూరు ఎస్‌ఐ బందోబస్తు నిర్వహించారు. శ్రీముఖలింగేశ్వరుడ్ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్‌, మామిడి గోవిందరావు, ఇంటెలిజెన్స్‌ ఎస్పీ (కౌంటరు) శ్రీనివాసరావు తదితర ప్రముఖులు దర్శించుకున్నారు. అలాగే టెక్కలి మండలం రావివలసలో ఎండలమల్లికార్జున స్వామి, శ్రీకాకుళంలోని ఉమారుద్రకోటేశ్వర ఆలయాలకు కూడా అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు.

Updated Date - Feb 16 , 2026 | 12:20 AM