లైంగిక దోపిడీని నిర్మూలించాలి
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:10 AM
లైంగిక దోపిడి మానవత్వానికి మాయనిమచ్చ అని, దీనిని సమూలంగా నిర్మూలించాల్సిన బాధ్య త అందరిపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయాధికారి కె.హరి బాబు అన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
పొందూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): లైంగిక దోపిడి మానవత్వానికి మాయనిమచ్చ అని, దీనిని సమూలంగా నిర్మూలించాల్సిన బాధ్య త అందరిపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయాధికారి కె.హరి బాబు అన్నారు. కొంచాడ గ్రామంలో సోమవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైంగిక దోపిడీ, బాల్యవివాహాల నివారణ, మాదక ద్రవ్యాల వినియో గం, రవాణాను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్.వెంకటేష్, డిప్యూటీ ఎంపీడీవో సింహాచలం, ప్యానల్ న్యాయవాదులు ఇందిరా ప్రసాద్, వైవీ బ్రహ్మం, పి.రామ్మోహన్, అశోక్ కుమార్, పంచాయతీ ఈవో శ్రీనివాసరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.