రోడ్డుపైకి మురుగు.. డ్రైనేజీల్లో చెత్త
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:52 PM
నరసన్నపేటలోని పల్లిపేట జంక్షన్ వద్ద శివాలయం సమీపంలో డ్రైనేజీలో చెత్తపేరుకుపోవడంతో రోడ్డుపైకి మురుగునీరు చేరుతోంది.
నరసన్నపేట, జనవరి 26(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలోని పల్లిపేట జంక్షన్ వద్ద శివాలయం సమీపంలో డ్రైనేజీలో చెత్తపేరుకుపోవడంతో రోడ్డుపైకి మురుగునీరు చేరుతోంది. వారంరోజులుగా పంచాయతీ సిబ్బంది డ్రైనేజీలో చెత్త తీయకపోవడంతో మురుగు నీరు రోడ్డుపైన శివాలయం ముందుభాగంలో ప్రవహించడంతో ఇబ్బందిపడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.ఇక్కడ శివాలయానికి వెళ్లే భక్తులు కూడా మురుగునీటిలో ఆలయానికి వెళ్లాల్సివస్తోంది. కాగా రోడ్డుపైకి మురుగునీరు రాకుం డా చర్యలు తీసుకుంటామని ఈవో ద్రాక్షాయిణి తెలిపారు.