Share News

సర్పంచ్‌ ఎన్నికలకు నామినేషన్‌ కేంద్రాల ఏర్పాటు

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:05 AM

జిల్లాలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ కేంద్రాలను ఏర్పాట్లుచేశారు. ఈ మేరకు గురువారం పలుచోట్ల ఏర్పాటుచేసిన నామినేషను కేంద్రాలను రిటర్నింగ్‌ అధికారులు పరిశీలించారు.

సర్పంచ్‌ ఎన్నికలకు నామినేషన్‌ కేంద్రాల ఏర్పాటు
జలుమూరు: శ్రీముఖలింగం నామినేషన్‌ కేంద్రంలో అధికారులతో మాట్లాడుతున్న ఎంపీడీవో చిన్నమ్మ :

జిల్లాలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ కేంద్రాలను ఏర్పాట్లుచేశారు. ఈ మేరకు గురువారం పలుచోట్ల ఏర్పాటుచేసిన నామినేషను కేంద్రాలను రిటర్నింగ్‌ అధికారులు పరిశీలించారు.

ఫసంతబొమ్మాళి (కోటబొమ్మాళి), నవంబరు 12(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలంలో మూడోవిడతలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 34 పంచాయతీలు పరిధిలో నామినేషన్లు స్వీకరణకు 10 నామినేషన్‌ కేంద్రాలను ఏర్పా టుచేశామని ఎంపీడీవో పార్వతీశం ఒకప్రకటనలో తెలిపారు. కాపుగోదాయవలస, సంతబొమ్మాళి పంచాయతీలకు సంతబొమ్మాళిలో, ఆకాశలక్కవరం, హనుమంతు నాయుడుపేట, యామలపేట పంచాయతీలకు హనుమంతునాయుడుపేటలో, లక్కీవలస, మరువాడ, కొల్లిపాడు పంచాయతీలకు లక్కీవలసలో, కె.నౌపడ, ఇజ్జువ రం, మర్రిపాడు, భావనపాడు పంచాయతీలకు కె.నౌపడలో, మూలపేట, కె.లింగూ డు, మేఘవరం పంచాయతీలకు కె.లింగూడులో, ఆరికవలస, చెట్లతాండ్ర, దండు గోపాలపురం, కోటపాడు, వడ్డీతాండ్ర పంచాయతీలకు దండుగోపాలపురంలో, బోరు భధ్ర, మలగాం,పాలతలగాం, ఆర్‌హెచ్‌పురం పంచాయతీలకు బోరుభఽఽధ్రలో, గోవిం దపురం, వడ్డివాడ, నర్సాపురం, కాకరాపల్లి, తోటాడ పంచాయతీలకు గోవిందపు రంలో , ఉమిలాడ, ఎస్బీ కొత్తూరు, జగన్నా థపురం పంచాయతీలకు ఉమిలాడలో, చిన్నతుంగాం, తాళ్ల వలస పంచాయతీలకు చిన్నతుంగాంలోని కేంద్రాల్లో నామినే షన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

ఫపోలాకి, నవంబరు, 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని సర్పంచ్‌ ఎన్నికల నేప థ్యంలో తొమ్మిది నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు ఎంపీడీవో ప్రకాష్‌ ఒకప్రకటనలో తెలిపారు. పోలాకి సచివాలయంలో పోలాకి, పల్లిపేట, అంపలాం, డోలలో డోల, గొల్లలవలస, సంతలక్ష్మీపురం, దీర్గాశిలో దీర్గాశి, రాళ్లపాడు, కే.పివలస, తలసముద్రం, మబగాంలో మబగాం, వనితమండలం, ఈదులవలస, జడూరులో జడూరు, పిరువాడ, గాతలవలస, చీడివలస, సుసరాంలో ఉరజాం, సుసరాం, చెల్లాయివలస, గంగివలస, ప్రియాగ్రహారంలో ప్రియాగ్రహారం, బెలమరపాలవలస, దండులక్ష్మీపురంలో డీఎల్‌పురం, కొత్తరేవు, గుల్లవానిపేట, గుప్పెడుపేట, పిన్నింటిపేటలో పిన్నింటిపేట, బొద్దాం, రహిమాన్‌పురం, కోడూరు సచివాలయపరిధిలోని అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకుప్రణాళికలు సిద్ధంచేశామని పేర్కొన్నారు. ఈనెల 26న తొలివిడతలో జరగాల్సిన సర్పంచ్‌ ఎన్నికలు మూడోవిడత డిసెంబరు రెండో తేదీకి వాయిదావేసినట్టు తెలిపారు.

ఫహిరమండలం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): మండలంలో 23 పంచాయతీల ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ పత్రాలు దాఖలుచేసేందుకు కేంద్రాలను అధి కారులు ఖరారుచేశారు. ఈ మేరకు ఎం.అవలంగి జడ్పీ ఉన్నతపాఠశాలలో రుగడ, కొమనాపల్లి, దగ్గుపురం, తంప, ఎం.అవలంగి, కల్లట, తుంగతంపర, చొర్లంగి, గొట్ట, లోకొండ పంచాయతీలు, సుభలయ జడ్పీ ఉన్నత పాఠశాలలో సుభలయ ఆర్‌ఆర్‌ కాలనీ, పెద్దగూడ, గులుమూరు, కొండరా గోలు, మర్రిగూడ, ఆర్టీసీ ఆర్‌ఆర్‌కాలనీ, హిరమండలం పంచాయతీ, ఎంఎల్‌పురం సచివాలయంలో కిట్టాలపాడు, అక్కరా పల్లి, అంబావల్లి, పిండ్రువాడ, ఎంఎల్‌పురం, భగీరధపురం పంచాయతీల నామి నేషన్‌ వేసేలా ఏర్పాట్లుచేసినట్లు ఎంపీడీవో కాళీప్రసాదరావు చెప్పారు.

ఫ జలుమూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) సర్పంచ్‌ అభ్యర్థులు, వార్డు మెంబర్ల నామినేషన్లు స్వీకరణకు మండలంలో ఐదు నామినేషను కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో బి.చిన్నమ్మడు తెలిపారు. ఈ మేరకు శ్రీముఖలింగం ఉన్నతపాఠశాలలో ఏర్పాటుచేసిన నామినేషను కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కో నామినేషను కేంద్రంలో ఎనిమిది పంచాయతీలకు సంబందించి నామినేషన్లు వేసుకోడానికి వీలు కల్పించామని తెలిపారు. ఒక్కోనామినేషన్‌ కేంద్రంలో ఇద్దరు ఆర్వోలను నియమించారని, ఒక్కో ఆర్వో నాలుగు పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్‌, వార్డు మెంబర్లు నామినేషన్లు స్వీకరిస్తారని చెప్పారు. శ్రీముఖలింగం, తిమడాం, కరవంజ, చల్లవానిపేట ఉన్నతపాఠశాల లతో పాటు, జలుమూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నామినేషన్ల కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జె.రామారావు, డిప్యూటి ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఎస్‌ఐ బి.అశోక్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 12:05 AM