కూరగాయల విక్రయానికి బయలుదేరి...
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:04 PM
లోలుగు గ్రామానికి చెందిన కూర గాయల వ్యాపారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం..లోలుగు గ్రామానికి చెందిన లోలుగు కన్నంనాయుడు (54) కూరగాయలు పండిస్తుంటాడు.
పొందూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): లోలుగు గ్రామానికి చెందిన కూర గాయల వ్యాపారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం..లోలుగు గ్రామానికి చెందిన లోలుగు కన్నంనాయుడు (54) కూరగాయలు పండిస్తుంటాడు. ఈ కూరగాయలను శ్రీకాకుళంలోని రైతుబజారులో విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం కూరగాయలతో ద్విచ క్రవాహనంపై శ్రీకాకుళం బయలుదేరాడు. మార్గమధ్యలో కేశవదాసుపురం పెట్రోల్ బంకు సమీపంలో భారీ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. దీంతో రోడ్డుపై పడిన కన్నంనాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఉదయమే కూరగాయల విక్రయానికి బయలుదేరిన భర్త ప్రమాదంలో మృతిచెందాడనే వార్త విని భార్య విజయలక్షితో పాటు గ్రామస్థులు విషాదంలో కూరుకుపోయారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పొందూరు ఎస్‌ఐ జి.రాజేష్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.