Share News

ఆమదాలవలసలో వైసీపీకి షాక్‌

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:51 PM

ఆమదాలవలస పట్టణంలో వైసీపీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన సుమారు 400 వైసీపీ కుటుంబాలు జేజే మోహనరావు, జేకే వెంకబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి. వీరికి రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.

ఆమదాలవలసలో వైసీపీకి షాక్‌
పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే రవికుమార్‌

టీడీపీలో చేరిన 400 కుటుంబాలు

కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస పట్టణంలో వైసీపీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన సుమారు 400 వైసీపీ కుటుంబాలు జేజే మోహనరావు, జేకే వెంకబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి. వీరికి రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో కార్యక్ర మంలో టీడీపీ నాయకులు కేవీ సత్యనారాయణ, పొట్నూరు రమేష్‌, పొట్నూరు శివ ఆటో డ్రైవర్లు, కూరగాయల మార్కెట్‌, మొబైల్‌షాప్‌లు, టైలర్స్‌, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

‘ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదు’

రాష్ట్రంలో ఐదేళ్ల విధ్వంస పాలనతో ప్రజలను నరకయాతనకు గురి చేసిన వైసీపీకి ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లా డుతూ.. గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ వరకు 19 ఎన్నికల అనుభవం ఉన్న తన కుటుంబంపై వైసీపీ చోటా నాయకుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 2026 సెప్టెంబరు 30న స్వగ్రామమైన పెనుబర్తి నుంచి ఆమదాలవలస మున్సిపల్‌ ఎన్నికల్లో చైర్మన్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సతీమణి కూన ప్రమీల ఓటు బదిలీ చేసుకోవడం జరిగిందన్నారు. తన వద్ద ఓటు మార్పిడికి సంబంధించి అన్ని ఆధారాలున్నాయన్నారు. అయితే వైసీపీ నాయకుడు కనీస అవగాహన లేకుండా ఓటు లేదని, దీనిపై విజయం సాధించి నా కోర్టును ఆశ్రయిస్తామంటూ ప్రజలను మభ్యపెట్టడం దారుణమన్నారు. తప్పుడు ఆరోపణలు చేసే వైసీపీ నాయకులపై పరువు నష్టం దావా వేయడంతో పాటు కేసులు నమోదు చేసి కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు.

Updated Date - Nov 22 , 2026 | 11:51 PM